తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి

  • హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో జరిగిన సమావేశం
  • మర్యాదపూర్వక భేటీ అని సీఎం కార్యాలయం వెల్లడి
  • భేటీ వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన సీఎంఓ
  • తెలుగు సినీ కార్మికుల ఫెడరేషన్ సమ్మె పిలుపు నేపథ్యంలో ప్రాధాన్యత
  • పరిశ్రమ సమస్యలపై చర్చించారనే ఊహాగానాలు
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఈ భేటీ జరిగింది. చిరంజీవి మర్యాదపూర్వకంగా సీఎంతో సమావేశమై మాట్లాడారంటూ సీఎంఓ కార్యాలయం ఈ భేటీకి సంబంధించిన వీడియోను ‘ఎక్స్‌’ ప్లాట్‌ఫారమ్‌లో పోస్టు చేసింది. కాగా, చిత్ర పరిశ్రమలోని సమస్యలపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డిని చిరంజీవి కలిశారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా, తెలుగు సినీ కార్మికుల ఫెడరేషన్ సమ్మెకు పిలుపునిచ్చిన సమయంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించకుంది.


More Telugu News