: వీడియో గేమ్ ఆటగాళ్ల దృష్టి సూపర్
వీడియో గేమ్ ఆడితే ఏమొస్తుంది... టైమ్ వేస్ట్ తప్పించి? అనే పెద్దవాళ్లు ఈసారి కొంచెం జాగ్రత్తపడతారేమో. ఎందుకంటే, వీడియోగేమ్ ఆడని వారితో పోలిస్తే బాగా ఆడేవాళ్ల దృష్టి, గ్రహించే శక్తి ఎక్కువగా ఉంటుందని ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది. లండన్ లోని డ్యూక్ యూనివర్సిటీ ఈ స్టడీ నిర్వహించింది. వీడియోగేమ్స్ ఎప్పుడూ ఆడనివాళ్లు, వీడియోగేమ్స్ ఎక్కువగా ఆడేవాళ్లను కలుపుకొని, 125 మందిని ఈ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ విద్యార్థులు పరిశోధించారు. "చూస్తున్న దృశ్యం నుంచి వీడియోగేమర్లు ఎక్కువ విషయాన్ని గ్రహించగలరు. మిగతా వారితో పోలిస్తే వీరిలో గ్రహణశక్తి అధికంగా ఉంటుంది" అంటూ మెడిసిన్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రెగ్ ఆపిల్ బామ్ వెల్లడించారు.