భారత్‌పై ట్రంప్ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ సమర్థన.. తప్పుబట్టిన కాంగ్రెస్ ఎంపీలు!

  • భారత్, రష్యా ఆర్థిక వ్యవస్థలు పతనమయ్యాయన్న ట్రంప్
  • ట్రంప్ నిజం చెప్పారంటూ రాహుల్ గాంధీ సమర్థన
  • రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో విభేదించిన శశిథరూర్, కార్తి
భారత్, రష్యా సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమర్థించడాన్ని సొంత పార్టీకి చెందిన ఎంపీ శశిథరూర్ తప్పుబట్టారు. రాహుల్ వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.

వాణిజ్య ఒప్పందాల గురించి మాట్లాడుతూ, భారత్-రష్యా ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికే పతనమయ్యాయని, వాటిని మరింత దిగజార్చుకోవద్దని ట్రంప్ వ్యాఖ్యనించారు. భారత ఆర్థిక వ్యవస్థ పతనమైందంటూ ట్రంప్ వాస్తవం చెప్పారంటూ రాహుల్ గాంధీ సమర్థించారు. రాహుల్ గాంధీ తీరుపై అధికార పక్షం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు సొంత పార్టీ నేతల నుంచి ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ట్రంప్‌ను రాహుల్ గాంధీ సమర్థించడంపై పార్లమెంటు వెలుపల మీడియా ప్రశ్నించగా, థరూర్ కొట్టిపారేశారు. భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో అందరికీ తెలుసని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎంపీ కార్తి చిదంబరం కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో విభేదించారు. ట్రంప్ సంప్రదాయేతర రాజకీయ నాయకుడంటూ చురకలు అంటించారు.


More Telugu News