ఇటీవల భారత సంతతి పైలట్ అరెస్ట్... అతడి మాజీ ప్రియురాలు మరీ దారుణం!

  • విమానం కాక్ పిట్ లోకి వెళ్లి మరీ పైలట్ ను అరెస్ట్ చేసిన అధికారులు
  • చిన్నారులపై లైంగిక వేధింపుల ఆరోపణలతో అరెస్ట్ 
  • మాజీ ప్రియురాలి కుమార్తెపైనా లైంగిక దాడి
  • ఆ విషయం తెలిసి కూడా అతడికి సహకరించిన మాజీ ప్రియురాలు
అమెరికాలో భారత సంతతికి చెందిన పైలట్ రుస్తోమ్ భగ్వాగర్‌ను శాన్ ఫ్రాన్సిస్కోలో విమానం ల్యాండైన వెంటనే కాక్ పిట్ లోకి వెళ్లి మరీ అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. అతడిని చిన్నారుల పట్ల లైంగిక వేధింపుల ఆరోపణలపై అరెస్టు చేశారు. అతని మాజీ ప్రియురాలు జెన్నిఫర్ పావెల్ (45) కూడా ఈ నేరాల్లో భాగస్వామి అని తేలింది. జెన్నిఫర్ కుమార్తెను కూడా రుస్తోమ్ వదల్లేదు. అతడు తన కుమార్తెను లైంగిక వేధిస్తున్న విషయం విషయం తెలిసినప్పటికీ, జెన్నిఫర్ అతడికి సహకరించిందని అధికారులు వెల్లడించారు. ఒక్కోసారి తన కుమార్తెపై అతడు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నప్పుడు చూస్తూ ఉండేదని, ఒక్కోసారి ఆమె కూడా ఆ చిన్నారిపై లైంగిక దాడిలో సహకరించేదని వివరించారు.

ఈ దుర్ఘటనలో బాధితురాలైన జెన్నిఫర్ కుమార్తె ప్రస్తుతం తన తల్లితో నివసించడం లేదు. ఆ బాలిక ఆరేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే రుస్తోమ్ లైంగిక దాడికి పాల్పడే వాడు. ఈ దారుణం ఆమెకు 11 ఏళ్లు వచ్చేవరకు సాగింది. ఆ తర్వాత రుస్తోమ్, జెన్నిఫర్ విడిపోయారు. ఈ వారంలో జెన్నిఫర్‌ను కూడా అరెస్టు చేశారు, ఇద్దరు నిందితులు ప్రస్తుతం మార్టినెజ్ డిటెన్షన్ ఫెసిలిటీలో ఉన్నారు. రుస్తోమ్ బెయిల్‌ను 15 మిలియన్ డాలర్లుగా నిర్ణయించగా, జెన్నిఫర్ బెయిల్ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

డెల్టా విమానంలో నాటకీయ అరెస్టు

రుస్తోమ్‌ను శనివారం శాన్ ఫ్రాన్సిస్కోలో విమానం ఆగిన వెంటనే అరెస్టు చేశారు. రుస్తోమ్‌కు తప్పించుకునే అవకాశం లేకుండా ఫెడరల్ ఏజెంట్లు చర్యలు తీసుకున్నారు. ప్రయాణీకులు కూడా తమ పైలట్‌ను చేతులకు బేడీలతో ఫెడరల్ ఏజెంట్లు తీసుకెళుతుండగా షాక్‌కు గురయ్యారు. డెల్టా ఎయిర్‌లైన్స్ ఈ పైలట్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. మేము ఈ విచారణలో పూర్తిగా సహకరిస్తాము అని డెల్టా ప్రతినిధి తెలిపారు.



More Telugu News