హైదరాబాదులో సంచరిస్తున్న చిరుత ఎట్టకేలకు చిక్కింది!

  • గత 12 రోజులుగా హైదరాబాదు శివారు ప్రాంతాల్లో చిరుత కలకలం 
  • 8 ట్రాప్‌ కెమెరాలు, 4 బోనులు ఏర్పాటు చేసిన అధికారులు 
  • మొయినాబాద్‌ ఎకో ట్రెక్ పార్కులో ఏర్పాటు చేసిన బోనులో చిక్కిన వైనం
గత 12 రోజులుగా హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లోని ప్రజలను భయాందోళనకు గురిచేసిన చిరుతపులి ఎట్టకేలకు బోనులో చిక్కింది. మంచిరేవులలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్లు అధికారులు ప్రకటించారు.

గత రెండు వారాలుగా నగర శివారులో చిరుత సంచారం స్థానికులను కలవరపెట్టింది. మృగవని పార్కు గ్రేహౌండ్స్‌ పరిధిలో ఈ చిరుత సంచారం తీవ్ర కలకలం రేపింది. చిరుతను బంధించేందుకు అటవీ అధికారులు 8 ట్రాప్‌ కెమెరాలు, 4 బోనులు ఏర్పాటు చేసినప్పటికీ, అది అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. ఎట్టకేలకు గత అర్ధరాత్రి దాటాక మొయినాబాద్‌ ఎకో పార్కులో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది.

చిరుతను త్వరలో నల్లమల అటవీ ప్రాంతంలో వదిలిపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు


More Telugu News