: మళ్లీ వస్తా.. సినిమా తీస్తా: శ్రీశాంత్
భారత జట్టులోకి మళ్లీ వస్తానంటున్నాడు క్రికెటర్ శ్రీశాంత్. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగులో జైలుపాలైన శ్రీశాంత్ బెయిల్ పై విడుదలైన అనంతరం ఈ రోజు మీడియాతో మాట్లాడాడు. "27 రోజుల జైలు జీవితం అనంతరం వచ్చిన నన్ను కెమెరా ఫ్లాష్ లు ఉలిక్కిపెడుతున్నాయి. ఇటీవల కాలంలో నాకు ఎదురైన సంఘటనలతో ఓ సినిమా తీసేందుకు ప్రయత్నిస్తా. ఈ ఘటనలో నాకు చాలామంది అండగా నిలిచినట్టు జైలు గదిలోనే తెలుసుకున్నాను. చాలా సంతోషంగా అనిపించింది. భారత జట్టులోకి వస్తాననే నమ్మకం ఉంది. దక్షిణాఫ్రికా పర్యటనలో ఆడాలని ఉంది. నా చివరి మ్యాచులో 145 కి.మీ వేగంతో బౌలింగ్ చేశాను" అంటూ వివరించాడు శ్రీశాంత్.