: వర్షంలో కూడా ఉత్సాహంగా చంద్రబాబు పాదయాత్ర
జోరువానని..వాన నీటిని లెక్క చెయ్యకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్రను కొనసాగిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో కుంభవృష్టిగా వర్షం కురుస్తున్నా తన వ్యక్తిగత కార్యదర్శి గొడుగు పట్టడంతో చంద్రబాబు నడక సాగిస్తున్నారు. పాదయాత్రని ఆపే ప్రసక్తే లేదన్న చంద్రబాబు ఉత్సాహం చూసి పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఉల్లాసంగా యాత్రలో పాల్గొంటున్నారు.