ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దేవానంద్ ప్రమాణం




ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఉదయం హైకోర్టులో ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ దేవానంద్ హైకోర్టులో నాలుగవ స్థానంలో కొనసాగుతారు. ఆయన పదవీకాలం 2028 ఏప్రిల్ 13 వరకు ఉంది. కాగా, జస్టిస్ బట్టు దేవానంద్ రాకతో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29 కి చేరింది.

జస్టిస్ బట్టు దేవానంద్ ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ లో 1966 లో జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బీఏ, లా కాలేజీ నుంచి న్యాయవాద పట్టా అందుకున్నారు. విద్యార్థుల సంఘం నాయకుడిగానూ వ్యవహరించారు. 2006 లో బార్ కౌన్సిల్ సభ్యుడిగా సేవలందించారు.


More Telugu News