తిరుపతిలో విజయ్ దేవరకొండకు ఊహించని రీతిలో నిరసన సెగ

  • విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో కింగ్డమ్
  • నేడు తిరుపతిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్
  • తిరుపతి విచ్చేసిన విజయ్ దేవరకొండ
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు తిరుపతిలో ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన రాకను నిరసిస్తూ గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. గతంలో గిరిజనుల గురించి విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. విజయ్ దేవరకొండ గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చినట్లు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, తిరుపతిలో ఆయన సినిమా ‘కింగ్డమ్’ ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు గిరిజనులు ప్రయత్నించారు. 

ఇవాళ, తిరుపతిలో కింగ్ డమ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. అయితే, గిరిజన సంఘాల హెచ్చరికల నేపథ్యంలో, ట్రైలర్ లాంచ్ కార్యక్రమం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

 ‘కింగ్డమ్’ చిత్రం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రం జులై 31న పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. 


More Telugu News