ఆ మాట ఊరికే అనలేదు... పవన్ కల్యాణ్ పై యాంకర్ శ్యామల విమర్శలు
- పిఠాపురంలో మత్స్యకారులకు పవన్ హామీ ఇచ్చారన్న శ్యామల
- హామీ నెరవేర్చాలని మత్స్యకారులు జనసేన కార్యాలయాన్ని ముట్టడించారని వెల్లడి
- కానీ పవన్ పట్టించుకోకుండా సినిమాతో బిజీ అయ్యారని విమర్శలు
వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఒక పక్క పిఠాపురంలో మత్స్యకారులు ఎన్నికల వేళ తమకు పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీని నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నారని వెల్లడించారు. ఆ డిమాండ్ తో వారు పిఠాపురం జనసేన కార్యాలయాన్ని ముట్టడిస్తే… పవన్ కల్యాణ్ మాత్రం తనది పిఠాపురమే కాదు అన్నట్టు తన సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో బిజీగా ఉన్నారని శ్యామల ఆరోపించారు. Think twice Vote wise (ఒకటికి రెండు సార్లు ఆలోచించండి… తెలివిగా ఓటేయండి) అని అందుకే అంటారు అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.