అనిల్ అంబానీ రిలయన్స్ ఆఫీసులలో ఈడీ రెయిడ్

  • మనీలాండరింగ్ కేసులో భాగంగా సోదాలు
  • ముంబైతో పాటు ఢిల్లీ నుంచి అధికారుల రాక
  • ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీకి చెందిన ఆఫీసులలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఈ రోజు ఉదయం నుంచి సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ముంబై, ఢిల్లీలోని ఆఫీసుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా అధికారులు ముంబైకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, అనిల్ అంబానీ నివాసంలో మాత్రం తనిఖీలు జరగడం లేదని సమాచారం.

అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థలు మనీలాండరింగ్ కు పాల్పడ్డాయనే ఆరోపణలతో ఈ సోదాలు చేపట్టినట్లు అధికార వర్గాల సమాచారం. రిలయన్స్ కమ్యూనికేషన్స్ తో పాటు అనిల్ అంబానీకి చెందిన ఇతర కంపెనీలలో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఇటీవల సీబీఐ రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసింది. అదేవిధంగా, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌తో పాటు ఆ సంస్థ ప్రమోటర్-డైరెక్టర్ అనిల్ అంబానీని ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ ‘మోసపూరితం’ అని పరిగణించిన సంగతి తెలిసిందే.


More Telugu News