ఆమెకు 38 అత‌డికి 19.. కాలేజీ ల్యాబ్ టెక్నీషియ‌న్‌తో స్టూడెంట్‌ ప్రేమ‌.. చివ‌రికి!

  • ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఘ‌ట‌న‌
  • ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ ఫ‌స్ట్ ఇయ‌ర్‌ చదువుతున్న యువ‌కుడు
  • అదే క‌ళాశాల‌లోని ల్యాబ్ టెక్నీషియ‌న్‌తో ప్రేమ‌ 
  • ఇద్ద‌రూ క‌లిసి బెంగ‌ళూరుకు వెళ్లిపోయిన వైనం
  • విద్యార్థి పేరెంట్స్ ఫిర్యాదుతో పోలీసుల ద‌ర్యాప్తు
  • బెంగ‌ళూరులో ఇద్ద‌రినీ గుర్తించి నిన్న చిత్తూరుకు తీసుకొచ్చిన పోలీసులు
చిత్తూరుకు చెందిన 19 ఏళ్ల‌ యువ‌కుడు ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ మొద‌టి సంవ‌త్స‌రం చదువుతున్నాడు. అదే క‌ళాశాల‌లో 38 ఏళ్ల మ‌హిళ ల్యాబ్ టెక్నీషియ‌న్‌గా ప‌ని చేస్తోంది. ఆమెకు ఇంత‌కుముందే పెళ్లి కాగా, భ‌ర్త‌తో విడిపోయి ఒంట‌రిగా ఉంటోంది. ఈ క్ర‌మంలో యువ‌కుడితో ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింది. దాంతో ఇద్ద‌రూ క‌లిసి జీవించాల‌నుకున్నారు. అంతే.. వారిద్ద‌రూ బెంగ‌ళూరుకు వెళ్లిపోయారు. 

మే 24న ఇంట‌ర్న్‌షిప్ కోసం బెంగ‌ళూరు వెళుతున్నానని చెప్పి ఇంట్లోంచి వెళ్లిన కుమారుడు ఎన్నాళ్ల‌యిన తిరిగి రాక‌పోవ‌డంతో త‌ల్లిదండ్రుల‌కు అనుమానం వ‌చ్చింది. దాంతో ఆరా తీయ‌గా, వారికి ల్యాబ్ టెక్నీషియ‌న్‌తో ప్రేమ వ్య‌వ‌హారం తెలిసింది. ఈ నెల 15న పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. 

యువ‌కుడి పేరెంట్స్ ఫిర్యాదు మేర‌కు చిత్తూరు రెండో ప‌ట్ట‌ణ సీఐ నెట్టికంఠ‌య్య కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేపట్టారు. బెంగ‌ళూరులో ఉన్న ఆ ఇద్ద‌రినీ గుర్తించి బుధ‌వారం చిత్తూరుకు తీసుకువ‌చ్చారు. అనంత‌రం కౌన్సెలింగ్ నిర్వ‌హించి, ఇద్ద‌రినీ వారి ఇళ్ల‌కు పంపించారు.     




More Telugu News