ర‌ష్మిక కొత్త బిజినెస్

  • న‌య‌న‌తార‌, స‌మంత‌ల బాట‌లోనే నేష‌న‌ల్ క్ర‌ష్ 
  • బ్యూటీ ప్రొడ‌క్ట్స్ బిజినెస్‌లోకి దిగిన‌ ర‌ష్మిక మంద‌న్న
  • 'డియ‌ర్ డైరీ' పేరుతో పర్ఫ్యూమ్ బ్రాండ్‌ లాంచ్
హీరోయిన్లు న‌య‌న‌తార‌, స‌మంత‌లానే నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న కూడా బ్యూటీ ప్రొడ‌క్ట్స్ బిజినెస్‌లోకి దిగారు. 'డియ‌ర్ డైరీ' పేరుతో పర్ఫ్యూమ్ బ్రాండ్‌ను ఆమె లాంచ్ చేశారు. ఈ మేర‌కు ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇది ఓ బ్రాండో లేదా పర్ఫ్యూమో కాద‌ని త‌న‌లో భాగ‌మ‌ని ఆమె పేర్కొన్నారు. కాగా, 'డియ‌ర్ డైరీ' పర్ఫ్యూమ్ ఒక్కో బాటిల్ ధ‌ర‌ రూ. 1600 నుంచి రూ. 2600 వ‌ర‌కు ఉంది. ఇక‌, క‌థానాయిక‌గా సూప‌ర్ స‌క్సెస్ అయిన ర‌ష్మిక‌... బిజినెస్‌లో ఏమేర‌కు రాణిస్తుందో వేచి చూడాలి.   

మ‌రోవైపు ర‌ష్మిక ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. తొలిసారి మైసా అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కూడా న‌టిస్తున్నారు. ఈ బ్యూటీ ఇటీవ‌ల టాలీవుడ్‌, బాలీవుడ్‌లో వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌లు సాధించిన సంగ‌తి తెలిసిందే. 'పుష్ప‌2', 'ఛావా', 'కుబేర' వంటి వ‌రుస హిట్స్ ఆమె ఖాతాలో ప‌డ్డాయి. 



More Telugu News