: భారత్ కు అందనంత ఎత్తులో భూటాన్


తీవ్రవాదుల బాంబు దాడులు, కాల్పుల మోతలు, మావోయిస్టుల కాల్పులు, మందుపాతర పేలుళ్లు భారత్ ను ప్రపంచంలో అత్యంత హింసాత్మక దేశాల్లో ఒకటిగా మార్చాయి. దీనికి నిదర్శనం నిన్న విడుదలైన గ్లోబల్ పీస్ఇండెక్స్(ప్రపంచ శాంతి సూచీ)2013. ప్రపంచంలో నివసించడానికి రక్షణ కరవైన 25 దేశాలలో భారత్ కూడా ఉన్నందుకు మనం గర్వించాలా? లేక 21వ శతాబ్దంలో మనదేశ పరిస్థితి చూసి దుఃఖించాలో తెలియని పరిస్థితి. ప్రపంచంలోని 162 దేశాలతో కూడిన శాంతి జాబితాలో మనదేశం ఎక్కడో ఆఖరున 141వ స్థానంలో ఉంది. భారత్ లో రోజుకి ఇద్దరు ఇలా అంతర్గత హింసాత్మక ఘటనల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారట. గతేడాది 799 మరణించారని సూచీ తెలిపింది. భారత్ కంటే ఈ జాబితాలో దిగువన పాక్, ఇరాక్, సూడాన్, అఫ్ఘానిస్తాన్ తదితర దేశాలు ఉన్నాయి. శాంతి విషయంలో భారత పాలకులు పొరుగు దేశాలను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ప్రపంచ శాంతి సూచీలో పొరుగు దేశం భూటాన్ 20వ స్థానంలో ఉంది. అంటే, ప్రపంచంలో శాంతి కాముక దేశంగా ఇది భారత్ కు అందనంత ఎత్తులో ఉందన్నమాట. నేపాల్ 82, బంగ్లాదేశ్ 105, శ్రీలంక 110 స్థానాలతో మనకంటే మెరుగ్గా ఉండడం విశేషం.

  • Loading...

More Telugu News