విశాఖ ఐటీసీ గోడౌన్‌లో అగ్నిప్రమాదం .. భారీగా ఆస్తినష్టం

  • గండిగుండం ఐటీసీ గోడౌన్‌లో ఎగిసిపడిన మంటలు
  • ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భావిస్తున్న
    అధికారులు
  • 8 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది
విశాఖపట్నంలోని ఐటీసీ గోడౌన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం కారణంగా భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. విశాఖ గండిగుండంలోని ఐటీసీ గోడౌన్‌లో ఈరోజు ఉదయం మంటలు చెలరేగాయి. సిగరెట్లు, బింగో ప్యాకెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ఎనిమిది అగ్నిమాపక వాహనాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారులు భావిస్తున్నారు.

ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాద ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు. 


More Telugu News