ఇది ఇంకో రష్యన్ మహిళ కథ... బిడ్డ కోసం భారతీయ తండ్రి పోరాటం!
- భారతీయ భర్తకు, రష్యన్ మహిళకు వారి బిడ్డ కస్టడీ గురించి న్యాయపోరాటం
- జులై 7 నుంచి బిడ్డతో సహా కనిపించకుండాపోయిన రష్యన్ మహిళ
- ఢిల్లీలోని రష్యన్ ఎంబసీలో ఆశ్రయం పొందుతున్నట్టు ఆరోపణలు!
ఇటీవల నీనా కుటినా అనే రష్యన్ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి కర్ణాటకలోని ఓ గుహలో తలదాచుకోవడం సంచలనం సృష్టించడం తెలిసిందే. ఇప్పుడు మరో రష్యన్ మహిళకు సంబంధించిన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. భారత్ లో ఓ రష్యన్ మహిళ తన బిడ్డతో కలిసి అదృశ్యం కావడంపై కలకలం రేపింది.
దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో జరుగుతున్న కస్టడీ వివాదంలో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. సదరు రష్యన్ మహిళ ఇంకా భారతదేశాన్ని చట్టబద్ధంగా విడిచి వెళ్లలేదని ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ కేసులో జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి, గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఓ రష్యన్ మహిళ, భారతీయ వ్యక్తి పెళ్లి చేసుకున్నారు. అయితే వారి కాపురంలో కలతలు రావడంతో బిడ్డ ఎవరి అధీనంలో ఉండాలన్న అంశంపై భర్త న్యాయపోరాటం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే రష్యన్ మహిళ తన బిడ్డతో సహా అదృశ్యమైంది. దీనిపై సుప్రీంకోర్టు స్పందించింది.
కేంద్ర ప్రభుత్వం సదరు మహిళకు, ఆమె బిడ్డకు వ్యతిరేకంగా లుక్‌అవుట్ నోటీసు జారీ చేయాలని, ఆమె పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకోవాలని, ఆమె దేశం విడిచి వెళ్లకుండా చూసేందుకు దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, ఇమ్మిగ్రేషన్ అధికారులకు సమాచారం అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
తన భారతీయ భర్తతో కస్టడీ పోరాటంలో ఉన్న రష్యన్ మహిళ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిందని, బిడ్డను తండ్రికి చూపించకుండా దాచిపెట్టిందని ఆరోపణలున్నాయి. జూలై 7 నుంచి వారి ఆచూకీ తెలియదని తండ్రి పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో... ఢిల్లీ పోలీసులు, విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు రష్యన్ రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడి, ఆ మహిళ ఆచూకీని గుర్తించేందుకు ప్రయత్నించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. జూలై 4న ఆమె రష్యన్ దౌత్యవేత్తతో కలిసి రష్యన్ రాయబార కార్యాలయంలోకి వెనుక ద్వారం నుంచి వెళ్ళినట్లు ఆరోపణలున్నాయి. దౌత్య సంబంధాలను, రాయబార కార్యాలయాల స్వయంప్రతిపత్తిని గౌరవిస్తున్నామని, అయితే దేశ చట్టాలను ఉల్లంఘించినట్లు రుజువైతే, చట్టం తన పని తాను చేసుకుపోతుందని కోర్టు స్పష్టం చేసింది.
ఢిల్లీ పోలీసులు, ఇతర అధికారులు మహిళ ఆచూకీని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించాలని, రైల్వే స్టేషన్లతో సహా అన్ని రవాణా మార్గాలను తనిఖీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మహిళ 2019 నుండి భారతదేశంలో నివసిస్తోంది, ఆమె వీసా గడువు ముగిసినప్పటికీ, కోర్టు ఆదేశాల మేరకు అది ఎప్పటికప్పుడు పొడిగించబడుతోంది. తదుపరి విచారణ జూలై 21కి వాయిదా పడింది.
ఈ కేసులో తల్లీబిడ్డల ఆచూకీని త్వరగా గుర్తించాలని, దేశం విడిచి వెళ్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాలు ఈ కస్టడీ వివాదానికి మరింత ఉత్కంఠను పెంచుతున్నాయి.