జగన్ కు తలకాయకు, మామిడికాయకు తేడా తెలియకుండా ఉంది: నిమ్మల రామానాయుడు
- వైసీపీ పాలనలో ఏపీ దారుణంగా నష్టపోయిందన్న నిమ్మల రామానాయుడు
- వైసీపీ నుంచి ప్రజలను కాపాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వ్యాఖ్య
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని ధీమా
2014లో జరిగిన రాష్ట్ర విభజన వల్ల ఏపీ చాలా నష్టపోయిందని... రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆ తర్వాత 2019 నుంచి 2024 మధ్య వైసీపీ పాలనలో అత్యంత దారుణంగా నష్టపోయిందని ఆరోపించారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం రక్షించే ప్రయత్నం చేస్తోందని అన్నారు. పురాణాలలో రాక్షసుల నుంచి ప్రజలను కాపాడినట్టుగా... ఇప్పుడు వైసీపీ నుంచి ప్రజలను కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
జగన్ చేస్తున్న వ్యాఖ్యలను చూస్తే... ఆయనకు తలకాయకి, మామిడికాయకి తేడా తెలియకుండా ఉందని ఎద్దేవా చేశారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, బెట్టింగ్ రాయుళ్లను జగన్ పరామర్శిస్తున్నారని మండిపడ్డారు. వైనాట్ 175 అన్న జగన్ కు ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో చూశామని అన్నారు. జగన్ పాలనలో అనేకమంది పారిశ్రామికవేత్తలు రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయారని గుర్తు చేశారు. మళ్లీ జగన్ అధికారంలోకి రాడన్న నమ్మకంతోనే పారిశ్రామికవేత్తలు తిరిగి ఏపీ వైపు చూస్తున్నారని అన్నారు.
నాడు పోలవరం గురించి అర్థం కాలేదన్న వైసీపీ మంత్రులు... ఇప్పుడు పోలవరం గురించి మాట్లాడుతుండటం ఆశ్చర్యంగా ఉందని నిమ్మల ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన నాయకులు ఇప్పుడు మాట్లాడటం సిగ్గుచేటుగా ఉందని అన్నారు. 2027 నాటికి పోలవరంను పూర్తి చేస్తామని తెలిపారు.
గత ప్రభుత్వం హంద్రీనీవాను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని... తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రాజెక్ట్ ను పూర్తి చేసి నీటిని విడుదల చేశామని చెప్పారు. సీడబ్ల్యూసీ అనుమతులతో త్వరలోనే బనకచర్ల ప్రాజెక్టును ప్రారంభిస్తామని తెలిపారు. గోదావరి నుంచి ప్రతి ఏటా 3 వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోతున్నా... జగన్ మాత్రం మిగులు జలాలు లేవని కామెంట్ చేయడం దారుణమని అన్నారు.