హెచ్‌సీఏ వ్యవహారంలో... ఉప్పల్ సీఐపై సస్పెన్షన్ వేటు

  • హెచ్‌సీఏ అక్రమాల వ్యవహారంలో ఏసీబీ సోదాల సమాచారాన్ని లీక్ చేశారనే ఆరోపణ
  • హెచ్‌సీఏ సెక్రటరీ దేవరాజ్ కు సహకరించినట్టు విచారణలో వెల్లడి
  • దేవరాజ్ అరెస్ట్ కు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అక్రమాల వ్యవహారంలో ఏసీబీ సోదాల సమాచారాన్ని లీక్ చేశారనే ఆరోపణ నేపథ్యంలో ఉప్పల్ సీఎ ఎలక్షన్ రెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. హెచ్‌సీఏ సెక్రెటరీ దేవరాజ్ కు ఆయన సహకరించినట్టు శాఖాపరమైన విచారణలో వెల్లడయింది. దేవరాజ్ అరెస్ట్ కు కూడా సీఐడీ రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. 

మరోవైపు హెచ్‌సీఏ తీరు చర్చనీయాంశంగా మారింది. హెచ్‌సీఏతో సన్ రైజర్స్ హైదరాబాద్ వివాదంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ పత్రాలతో జగన్మోహన్ రావు శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేసినట్టు సీఐడీ విచారణలో తేలింది. నకిలీ పత్రాల ద్వారానే హెచ్‌సీఏలో ఆయన అధ్యక్షుడిగా పోటీ చేసినట్టు విచారణలో తేలింది. 




More Telugu News