ప్రసన్నకుమార్ రెడ్డిపై చర్యలు తీసుకుంటున్నాం: అనిత

  • ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న వ్యాఖ్యలను కోర్టులు కూడా తప్పుపట్టాయన్న అనిత
  • జగన్ మానవత్వం ఉన్న వ్యక్తిలా వ్యవహరించడం లేదని మండిపాటు
  • సొంత చెల్లెలు గురించే తప్పుడు ప్రచారం చేసిన చరిత్ర జగన్ దని విమర్శ
వైసీపీ అధినేత జగన్ మానవత్వం ఉన్న మనిషిలా వ్యవహరించడం లేదని ఏపీ హోంమంత్రి అనిత మండిపడ్డారు. జగన్ నుంచే ప్రసన్నకుమార్ రెడ్డి నేర్చుకున్నారని... మహిళా (ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి) నేతపై ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను న్యాయస్థానాలు కూడా తప్పుపట్టాయని చెప్పారు. ప్రసన్నపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

ప్రసన్న తీరును జగన్ తప్ప ఎవరూ సమర్థించడం లేదని అనిత విమర్శించారు. రక్తం పంచుకుని పుట్టిన సొంత చెల్లెలు గురించే తప్పుడు ప్రచారం చేసిన చరిత్ర జగన్ దని మండిపడ్డారు. బెట్టింగ్ యాప్ లలో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబాలను, రౌడీషీటర్లను జగన్ పరామర్శిస్తున్నారని చెప్పారు. జగన్ పర్యటనల్లో ఒకసారి తలకాయను, మరోసారి మామిడికాయలను తొక్కించారని అన్నారు. రప్పా రప్పా నరుకుతామని అనడం తప్పుకాదా? అని ప్రశ్నించారు.   


More Telugu News