లంబోర్గిని సూపర్ కారు వ‌ర్సెస్ కుక్క‌.. కొద్దిసేపు కోట్ల రూపాయ‌ల కారును ఆటాడుకున్న శున‌కం!

  • ముంబై వీధిలో లంబోర్గిని కారును కొద్దిసేపు ఆటాడుకున్న ఓ వీధి కుక్క 
  • ఖ‌రీదైన కారు దారిని అడ్డ‌గించిన శునకం
  • దాని తాలూకు వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌
  • ఫ‌న్నీ కామెంట్లు చేస్తున్న నెటిజ‌న్లు
ముంబై వీధిలో లంబోర్గిని సూపర్ కారును ఓ వీధి కుక్క కొద్దిసేపు ఆటాడుకుంది. దాని తాలూకు వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం ఎక్స్‌ లో వైర‌ల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైనశైలిలో కామెంట్లు చేస్తున్నారు. 

వీడియోలో ఏముందంటే..!
అటుగా వ‌స్తున్న ఓ నారింజ రంగు లంబోర్గిని కారు ముందు ఒక వీధి కుక్క నిలబడి, వాహ‌నం దారిని అడ్డ‌గించ‌డం మ‌నం వీడియోలో చూడొచ్చు. దాంతో దాని డ్రైవర్ కుక్కను త‌ప్పించి తన మార్గంలో వెళ్లడానికి సూపర్ కారును ప‌క్క‌కు పోనిచ్చాడు. కానీ, శున‌కం ఆ కారునే అనుస‌రించ‌డం వీడియోలో ఉంది. 

డ్రైవర్ తన కారును తిప్పినప్పుడు, కుక్క దానిని అనుసరించి మొరిగింది. కొంత సేప‌టి తర్వాత, లంబోర్గిని కుక్కను దాటి దూసుకుపోయింది. దాంతో దాన్ని శున‌కం కొంత‌ దూరం వరకు వెంబడించింది.

ఈ వీడియోను "కాలేష్ బీ/వీ సర్ డోగేష్ అండ్‌ లంబోర్గిని" అనే క్యాప్షన్ తో షేర్ చేయ‌గా, అది కాస్తా వైర‌ల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజ‌న్లు "రోడ్డు యొక్క నిజమైన బాస్" అని అభివ‌ర్ణించారు. అలాగే కొన్ని ఫన్నీ కామెంట్లు కూడా వ‌చ్చాయి. 

"దోగేష్ భాయ్ ఇత్నే బడే లోగో సే లఫ్డే క్యూ కర్ రహా హై (దోగేష్ భాయ్, ఇంత పెద్ద వ్యక్తులతో మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు)" అని ఒక‌రు, "గజాబ్ కీ దాదాగిరి హై డాగీ రాజా కీ. లంబోర్గిని కి సిట్టి పిట్టి గమ్ హో గై ఔర్ వో భాగ్ ఖాదీ హుయ్ (కుక్క ఏమ‌న్నా తగ్గిందా... దెబ్బ‌కు లంబోర్గిని పారిపోయింది)" అని మ‌రొక‌రు, "బ్రో అక్షరాలా లాంబోను బెదిరించాడు" అని ఇంకొకరు కామెంట్ చేశారు.


More Telugu News