ప్రభంజన్ యాదవ్ మృతి పట్ల కేసీఆర్ దిగ్బ్రాంతి

  • ఈ ఉదయం కన్నుమూసిన ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్
  • రాష్ట్ర సాధనలో ఆయన కృషిని స్మరించుకున్న కేసీఆర్
  • ప్రభంజన్ యాదవ్ ఉద్యమ నిబద్ధత చాలా గొప్పదన్న కేసీఆర్
తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ ఈ ఉదయం హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. ప్రభంజన్ యాదవ్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధనలో ఆయన కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. 

ఢిల్లీలో తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రభంజన్ యాదవ్ ఉద్యమ నిబద్ధత చాలా గొప్పదని కేసీఆర్ అన్నారు. మహాత్మా పూలే, అంబేద్కర్ సామాజిక తాత్విక ఆలోచనతో బీసీ కులాల హక్కులు, పురోగతి కోసం నిరంతరం తపించే ప్రభంజన్ యాదవ్ మృతితో తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప సామాజిక ఉద్యమకారుడిని, తాత్వికుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


More Telugu News