: ఇమ్మిగ్రేషన్ బిల్లు పరిశీలనకు అమెరికా సెనేట్ ఓకే


అమెరికా వలసవాద సంస్కరణల బిల్లును పరిశీలించడానికి ఆ దేశ చట్టసభ సెనేట్ ఆమోదం తెలిపింది. 82 మంది సెనేటర్లు బిల్లుపై చర్చకు సానుకూలంగా ఓటేయగా, కేవలం 15 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో ఈ బిల్లు ఆమోద ప్రక్రియకు మార్గం సుగమం అయింది. ఇది ఆమోదం పొందితే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 1.10కోట్ల మందికి పౌరసత్వం లభిస్తుంది. ఇందులో 2.5లక్షల మంది భారతీయులు కూడా ఉన్నారు. అదే సమయంలో హెచ్1బి వీసా ఉద్యోగుల విషయంలో ఐటీ కంపెనీలపై బిల్లులో ప్రవేశపెట్టిన ఆంక్షలు భారత ఐటీ కంపెనీలకు ప్రతికూలం కానున్నాయి. దీనివల్ల ఆ దేశానికి భారతీయులను పరిమితంగానే పంపడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎక్కువమంది ఉంటే వారిని తగ్గించాల్సి ఉంటుంది. లేకుంటే ఒక్కో ఉద్యోగిపై ఏటా భారీగా జరిమానా పడుతుంది. ఒకవైపు హెచ్1బి వీసాల పరిమితిని వార్షికంగా 1.20లక్షలకు పెంచుతూనే, భారత ఐటీ కంపెనీలు వాటిని వినియోగించుకోకుండా సెనేటర్లు ఆంక్షలు పెట్టడం గమనార్హం.

  • Loading...

More Telugu News