ఏపీలో 5 నగరాలకు కేంద్రం 'స్వచ్ఛ సర్వేక్షణ్' అవార్డులు... విశాఖకు 'మినిస్టీరియల్' అవార్డు

  • ఈ ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రకటించిన కేంద్రం
  • విశాఖ, గుంటూరు, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి నగరాలకు అవార్డులు
  • పరిశుభ్రత అంశంలో అవార్డులు
ఏపీలోని 5 నగరాలు 'స్వచ్ఛ సర్వేక్షణ్' అవార్డులకు ఎంపికయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ ఏడాది 'స్వచ్ఛ సర్వేక్షణ్' అవార్డులను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి నగరాలు పరిశుభ్రత విషయంలో ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు ఈ అవార్డులకు ఎంపికయ్యాయి. ఇందులో విశాఖ నగరానికి' స్పెషల్ కేటగిరీ మినిస్టీరియల్' అవార్డు దక్కగా... విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలు 'స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీస్' కేటగిరీలో ఎంపికయ్యాయి. రాజమండ్రి నగరం రాష్ట్రస్థాయి మినిస్టీరియల్ అవార్డుకు ఎంపికైంది.

స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా నిర్వహించే ఈ సర్వేలో పట్టణాల్లోని పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, పౌరుల సహకారం, స్థిరమైన పరిష్కారాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. విశాఖపట్నం రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నగరాల పౌరులను, స్థానిక సంస్థలను అభినందించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రాష్ట్రంలో పరిశుభ్రతపై అవగాహనను మరింత పెంచేందుకు దోహదపడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.


More Telugu News