సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆ నలుగురు చిన్నారులకు సైకిళ్లు అందజేత

  • శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు గ్రామంలో ఇటీవల మెగా పీటీఎంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, నారా లోకేశ్
  • సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన తల్లికి వందనం లబ్దిదారురాలు మాధవి 
  • మాధవి పిల్లలు అడగడంతో సైకిళ్లు అందించాలని కలెక్టర్‌‌ను ఆదేశించిన సీఎం 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు గ్రామంలో నలుగురు చిన్నారులకు అధికారులు సైకిళ్లను అందజేశారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబును తల్లికి వందనం పథకం లబ్ధిదారు మాధవి, నరసింహులు దంపతులు తమ నలుగురు పిల్లలతో కలిసి స్వాగతించారు.

తల్లికి వందనం పథకం కింద మాధవికి నలుగురు పిల్లల కోసం రూ.52 వేలు బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ మాధవి కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడారు. ఆ సమయంలో తమకు సైకిళ్లు కావాలని మాధవి పిల్లలు ముఖ్యమంత్రిని కోరారు.

దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నలుగురికి సైకిళ్లు అందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ టి.ఎస్. చేతన్ సూచనలతో అధికారులు వారి ఇంటికి వెళ్లి నాలుగు సైకిళ్లను అందజేశారు. దీంతో ఆ పిల్లలు సంతోషం వ్యక్తం చేశారు. 


More Telugu News