: ఆగిన రూపాయి పతనం
వరుసగా కొన్ని రోజుల పాటు సాగుతున్న రూపాయి విలువ క్షీణతకు బ్రేక్ పడింది. నిన్న 68.90కి పడిపోయి జీవిత కాల కనిష్ఠ స్థాయిని నమోదు చేయడంతో ఆర్ బీఐ రంగంలోకి దిగి డాలర్లను విక్రయించింది. దీంతో రూపాయి కోలుకుంది. అలాగే ఎగుమతి దారులు తమ వద్దనున్న డాలర్లను విక్రయించాలని ఆర్ బీఐ సూచించింది. ఈ చర్యల ఫలితంతో ఈ రోజు ఫారెక్స్ మార్కెట్లో 14 పైసల లాభంతో రూపాయి 58.25వద్ద ట్రేడవుతోంది. ఇతర కరెన్సీలు లాభాల్లో కొనసాగుతుండడం ఈ రోజు రూపాయి కోలుకోవడానికి అనుకూలించింది.