: క్షమాభిక్ష తిరస్కరణపై సుప్రీంకోర్టులో సవాల్ చేసిన వీరప్పన్ అనుచరులు
తమ క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ వీరప్పన్ నలుగురు అనుచరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రేపు ఉదయం వీరికి ఉరిశిక్ష అమలు చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే సుప్రీంకోర్టులో క్షమాభిక్ష తిరస్కరణపై వీరు సవాల్ చేయడంతో రేపు ఉదయం సుప్రీంకోర్టు న్యాయమూర్తి నివాసంలో విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది.