: ప్రపంచ వృద్ధుడు కన్నుమూత
ప్రపంచంలోనే వృద్ధుడిగా గుర్తింపు పొందిన జపాన్ వాసి, 116 ఏళ్ల జిరోమాన్ కిమురా అనారోగ్యం కారణంగా ఈ లోకం నుంచి శాశ్వత సెలవు తీసుకున్నాడు. ఇతడు 1897లో జన్మించాడు. ప్రపంచంలో జీవించి ఉన్న వృద్ధుడిగా జిరోమాన్ ను 2012 డిసెంబర్ లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. అమెరికాకు చెందిన 115 ఏళ్ల బామ్మ మరణించాక, ఆ కిరీటం జిరోమాన్ కు దక్కింది.