: వచ్చే నెలలో రాష్ట్రానికి మోడీ
బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా నియమితులైన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ జూలై మూడో వారంలో రాష్ట్రానికి రానున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. మోడీ ప్రభావం ఏమీ ఉండదన్న టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. దమ్ముంటే ఆయన టీడీపీ నిర్వహించిన సర్వేలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మోడీ నాయకత్వంలోనే బీజేపీ ఎన్నికలకు వెళుతుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.