: సీబీఐ జేడీ కొనసాగింపు మా పరిధిలోకి వస్తుందా?: హైకోర్టు


సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ బదిలీని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టు ఈ రోజు విచారణ నిర్వహించింది. కీలకమైన కేసులను దర్యాప్తు చేస్తున్న సమయంలో జేడీగా ఉన్న లక్ష్మీనారాయణను బదిలీ చేయడం వల్ల వాటిపై ప్రభావం పడుతుందని, ఆయనను కొనసాగించాలని పిటిషనర్ కోరారు. సీబీఐ జేడీ కొనసాగింపు అంశం తమ పరిధిలోకి వస్తుందా? లేక సుప్రీంకోర్టు, లేక ఢిల్లీ హైకోర్టు పరధిలోకి వస్తుందా? అన్న దానిపై వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ ను కోరుతూ హైకోర్టు విచారణను వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News