: శాసనసభలో ఎవరిగోల వారిదే


శాసనసభ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగడం లేదు. సభ్యుల తీరుతో వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. మూడోరోజు బుధవారం సభ ప్రారంభమైన వెంటనే ప్రాణహిత-చేవెళ్లె, పోలవరం ప్రాజెక్టులకు జాతీయ హోదాపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చర్చకు పట్టుబట్టారు. ఇక తెలంగాణపై తీర్మానం కోసం టీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టూ చేరి నినాదాలు చేశారు. దాంతో స్పీకర్ సభను అరగంటపాటు వాయిదా వేశారు. మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా టీఆర్ఎస్ సభ్యులు తమ తీరును కొనసాగించారు. ఈ నెల 14న నిర్వహించనున్న చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ స్పీకర్ పోడియం దగ్గరకు చేరి నినాదాలు చేస్తున్నారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ మనోహర్, మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి కోరినా వినలేదు. దాంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ మరోసారి సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

  • Loading...

More Telugu News