: ఫిట్ నెస్ లేని పాఠశాలల బస్సులపై కేసులు
పాఠశాలలు పున:ప్రారంభం కావడంతో రవాణా శాఖాధికారులు స్కూల్ బస్సుల తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో స్కూలు బస్సులకు పిట్ నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా లేని 11 బస్సులను గుర్తించి వాటిని సీజ్ చేశారు. ఆయా పాఠశాలలపై కేసులు నమోదు చేశారు. ఫిట్ నెస్ లేని స్కూల్ బస్సుల వల్ల ఏటా పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి రవాణాధికారులు ముందుగానే మేల్కొని విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తనిఖీలు చేపట్టడం సంతోషించదగ్గ విషయం.