: మోగిన బడిగంటలు
చిట్టిపొట్టి చిన్నారులు బండెడు పుస్తకాలతో మళ్లీ కొత్త విద్యా సంవత్సరంలోకి ప్రవేశించారు. నేటి నుంచీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. చాలా వరకు ప్రైవేటు పాఠశాలలు కొన్ని రోజుల క్రితమే ప్రారంభమైన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ లోని సీతాఫల్ మండి ప్రభుత్వ పాఠశాలలో జరిగిన అక్షరాభ్యాస కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ హాజరయ్యారు.