: నీ ఇల్లు 'బంగారం' కానూ!


ఆ కాలంలో రాజుల రధాలకు బంగారు తాపడం చేసేవారని కథల్లో చదివాం... విన్నాం... అయితే భవనానికి బంగారు తాపడం గురించి మనం ఎక్కడా వినలేదు... అందునా... సదరు బంగారు భవనం కదులుతుందట... ఇది మరీ విడ్డూరంగా ఉంది కదూ... ఈ కొత్త బంగారు భవనం నిజంగానే కదులుతుందట. అందుకే ఇది చాలా ఖరీదైంది. అయితేనేం... ఇందులో ఎన్ని విలాసాలున్నాయో...! ఈ కదిలే బంగారు భవనం పేరు స్పేస్‌ ఏజ్‌ ఎలిమెంట్‌ ప్లాజ్జో. ఈ బంగారు భవంతిని మార్చీ మొబైల్‌ అనే సంస్థ నిర్మించింది. దీని ఖరీదు రూ.17 కోట్లు (30లక్షల డాలర్లు) మాత్రమే. దీన్ని దుబాయ్‌లో విక్రయించడం జరిగింది. ఇంతటి ఖరీదైన భవంతి ముచ్చట్లేంటంటే...

ఇందులో విలాసవంతమైన పడకగదులు, స్నానపుగదులు, విశాలమైన హాలు, అత్యాధునిక గృహోపకరణాలు, బార్‌, రూఫ్‌టాప్‌ టెర్రెస్‌ ఉన్నాయి. ఈ కదిలే వింత భవంతికి మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కదిలే సౌధం ఇదేనట... ఈ విషయాన్ని డెయిలీ మెయిల్‌ వెల్లడించింది. భవిష్యత్తులో నేలపై ఇల్లు కట్టుకోవడం కష్టమవుతోన్న తరుణంలో ఇలాంటి కదిలే ఇళ్లే వస్తాయేమో... అయితే ఇంత ఖరీదైనవి మాత్రం కావులేండి...!

  • Loading...

More Telugu News