: హైదరాబాద్ లో నిషేధాజ్ఞలు
చలో అసెంబ్లీ సందర్భంగా రాజధానిలో నిషేధాజ్ఞలు అమలులోకి రానున్నాయి. దీంతో అసెంబ్లీ, సచివాలయం, జేహెచ్ఎంసీ, ఖైరతాబాద్, నాంపల్లి, బూర్గుల రామకృష్ణారావు భవనం తదితర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమలులోకి రానున్నాయి. రేపు ఉదయం 6 గంటల నుంచి 18 వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ ఆయా ప్రాంతాల్లో సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం విధించినట్టు కమీషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. ఈ సమయంలో నగరంలోని ప్రజలంతా అప్రమత్తమై ఉండాలని, ఆస్తులు ధ్వంసమైతే చూస్తూ ఊరుకునేది ఉండదని స్పష్టం చేసారు. నిషేధాజ్ఞలు ఎవరైనా ఉల్లంఘిస్తే వారిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా తీవ్రమైన కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని కమీషనర్ హెచ్చరిస్తున్నారు.