: విజయానికి కాస్త దూరంలో టీమిండియా 118/1
టీమిండియా ఓపెనర్లు కుదురుకున్నారు. విండీస్ బౌలర్లను ఆటాడుకుంటున్నారు. రోచ్, రాంపాల్, నరైన్, సమీ, బ్రావో ... బౌలర్ ఎవరైనా సరే ధాటిగా ఎదుర్కొంటున్నారు. 16 ఓవర్లు ముగిసేసరికి అజేయంగా సెంచరీ పూర్తి చేసారు. తరువాత కొద్ది సేపటికే రోహిత్ నరైన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 106 పరుగులకు ఒక వికెట్ కోల్పోయింది. తొలుత ఓపెనర్లు ధాటిగా ఆడుతూ 16 ఓవర్లకే సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసారు. అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ కాసేపటికే పెవిలియన్ బాటపట్టాడు. దీంతో కోహ్లీ జతగా అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు ధావన్. దీంతో టీమిండియా 118/1 స్కోరు చేసింది.