: శుక్లా మృతికి సంతాపం తెలిపిన ప్రధాని


కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లా మృతి పట్ల ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాపం తెలియజేశారు. గతనెల 25న శుక్లా చత్తీస్ గఢ్ లో జరిగిన మావోయిస్టుల దాడిలో తీవ్ర గాయాలపాలయ్యారు. అప్పటినుంచి గుర్గావ్ లోని మేదాంత మెడిసిటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. కాగా, ప్రధాని తన సందేశాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

  • Loading...

More Telugu News