: ప్రధాని పదవికి అద్వానీ అర్హుడు: బీసీ ఖండూరీ


ప్రధాని పదవికి బీజేపీలో సరైన అభ్యర్ధి అద్వానీయే అని సీనియర్ నేత బీసీ ఖండూరీ వ్యాఖ్యానించారు. డెహ్రాడూన్ లో ఖండూరీ మాట్లాడుతూ, గుజరాత్ సీఎం నరేంద్రమోడీని లోక్ సభ ఎన్నికల సమరానికి పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ గా ఎంపిక చేయటాన్ని ప్రశంసించారు. అయితే, ప్రధాని పదవికి బీజేపీ నుంచి అద్వానీ అన్ని విధాలా అర్హుడని చెప్పడానికి సందేహమక్కర్లేదని తెలిపారు. మోడీ నియామకంతో పార్టీ ప్రయోజనం పొందుతుందన్న విశ్వాసాన్ని ఖండూరీ వ్యక్తం చేసారు.

  • Loading...

More Telugu News