ఏపీ మెగా డీఎస్సీ హాల్‌టికెట్లు విడుద‌ల

  • ఏపీలో 16,347 టీచ‌ర్‌ ఉద్యోగాల‌ భర్తీకి మెగా డీఎస్సీ 2025
  • జూన్ 6 నుంచి 30వ తేదీ వ‌ర‌కు ప‌రీక్ష‌లు
  • మెగా డీఎస్సీ పరీక్షలకు షెడ్యూల్ కూడా రిలీజ్
ఏపీలో 16,347 ఉపాధ్యాయ‌ ఉద్యోగాల‌ భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ 2025 హాల్ టికెట్లు తాజాగా విడుదలయ్యాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏపీ డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ https://apdsc.apcfss.in/ ద్వారా తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్య‌ర్థులు త‌మ వివ‌రాల‌ను ఎంట‌ర్ చేసి హాల్ టికెట్లు పొంద‌వ‌చ్చు.  

ఇక, ఈ డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి 30వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అందుకు తగట్లుగా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. అభ్యర్థుల ప్రాక్టీస్‌ కోసం ఇప్పటికే డీఎస్సీ మాక్‌ టెస్ట్‌లు కూడా విడుదల చేసింది. 

కాగా, ఏపీకి చెందిన వారితోపాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కలిపి మొత్తం 3,35,401 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు స‌మాచారం. దీంతో ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడుల్లోనూ ఎగ్జామ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. అలాగే ఈ మెగా డీఎస్సీ పరీక్షలకు షెడ్యూల్ కూడా విడుదలైంది. 




More Telugu News