తలుపులు మూయడం మరవొద్దు.. మెక్రాన్ కు ట్రంప్ సలహా

  • మీడియా సమావేశంలో మెక్రాన్ అంశం ప్రస్తావించిన విలేకరి
  • ఫన్నీగా స్పందించిన అమెరికా అధ్యక్షుడు
  • ఈ విషయంపై మెక్రాన్ తో మాట్లాడానని చెప్పిన ట్రంప్
వియత్నాం పర్యటన సందర్భంగా విమానంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ను ఆయన సతీమణి తోసేస్తున్నట్లుగా ఉన్న వీడియో వైరల్ గా మారింది. విమానం తలుపులు తెరుస్తుండగా మెక్రాన్ కనిపించారు. లోపల ఉన్నవారితో ఆయన మాట్లాడుతున్నట్లు కనిపించింది. అంతలోనే ఎర్రని స్లీవ్స్‌ ధరించిన రెండు చేతులు మెక్రాన్‌ను నెట్టివేశాయి. దీంతో ఆశ్చర్యానికి గురైన మెక్రాన్ మీడియాను చూసి తమాయించుకున్నారు. చిరునవ్వుతో మీడియాకు అభివాదం చేశారు.

ఆ తరువాత ఫొటోల్లో మెక్రాన్, ఎర్రని జాకెట్‌ వేసుకొని బ్రిగెట్టా విమానం మెట్ల వరుసపై కనిపించారు. దీంతో మెక్రాన్ ను ఆయన భార్య బ్రిగెట్టా తోసేసిందని, వారిద్దరి మధ్య పొసగడంలేదని ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ ఘటనపై స్పందించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను మీడియా కోరగా.. ఈ విషయంపై తాను మెక్రాన్ తో మాట్లాడానని, అంతా సవ్యంగానే ఉందని ట్రంప్ చెప్పారు. ఆ తర్వాత మెక్రాన్ కు ఫన్నీగా ఓ సలహా కూడా ఇచ్చారు. ‘ఇలాంటి సందర్భాలలో తలుపులపై ఓ కన్నేసి ఉంచాలి, డోర్లు మూసేయడం మరిచిపోవద్దు’ అంటూ ట్రంప్ చమత్కరించారు.


More Telugu News