: సింగపూర్ లో 9 వేల మందికి డెంగీ జ్వరం
సింగపూర్ లో డెంగ్యూ సీజన్ నడుస్తోంది. ఎందుకంటే అక్కడ 9 వేల డెంగీ జ్వరాలు ఇప్పటివరకూ నమోదు కాగా, వీరిలో ఇద్దరు చనిపోయారు. దీనిపై సింగపూర్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రోగుల పట్ల ప్రత్యేకశ్రద్ధ చూపాలని ఆసుపత్రులకు మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం పౌరులకు కూడా మర్గదర్శకాలు విడుదల చేసింది. పరిశుభ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. పరిసరాలు అపరిశుభ్రంగా ఉంచితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపింది. అలాంటి ఇళ్లను అధికారులు గుర్తిస్తే భారీ జరిమానాతో పాటు మూడు నెలల జైలు జీవితాన్ని కూడా రుచి చూడాల్సి ఉంటుందని సింగపూర్ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. గతంలో 2005లో సింగపూర్ లో 14 వేల డెంగీ జ్వరం కేసులు నమోదవగా, 25 మంది చనిపోయారు. మరి, ఇప్పడేం జరుగుతుందో అని పౌరులు ఆందోళన చెందుతున్నారు.