: గుంటూరులోనూ 'సిమ్స్' లీలలు
విశాఖలో రూ. 500 కోట్లకు డిపాజిట్ దారులను ముంచేసిన సిమ్స్ సంస్థ అక్రమాలు గుంటూరు జిల్లాలోనూ వెలుగులోకి వచ్చాయి. సిమ్స్ ఎండీ సురేంద్ర బాబు పొన్నూరులో ‘గోల్డెన్ ఫారెస్ట్’ అంటూ ఖాతాదారులకు రూ. 30 కోట్లకు టోపీ పెట్టినట్టు తెలుస్తోంది. కాగా, సిమ్స్ బాధితుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. విశాఖ, అనకాపల్లి, యలమంచలి, జంగారెడ్డిగూడెం లలోని సిమ్స్ కార్యాలయాలపై దాడులకు దిగారు.
ప్రస్తుతం పరారీలో ఉన్న సిమ్స్ డైరక్టర్లలో ఓ పోలీసు ఉన్నతాధికారి కుమారుడు కూడా ఉన్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇదిలావుంటే, పోలీసులకు సిమ్స్ డైరీ దొరికినట్టు తెలుస్తోంది. దాంట్లో పోలీసులకు, మీడియా ప్రతినిధులకు ఇచ్చిన ముడుపుల వివరాలు ఉన్నాయని సమాచారం.