: రాష్ట్ర రాజధానిలో బాంబు బెదిరింపు
హైదరాబాదులో మరోసారి బాంబు కలకలం రేగింది. రాష్ట్ర రాజధానిలోని బిర్లామందిర్, సచివాలయంలతో పాటు మరికొన్ని ముఖ్య ప్రాంతాలలో బాంబులు పెట్టినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసు సిబ్బంది..బాంబు నిర్వీర్య బృందంతో తనిఖీలు చేపడుతున్నారు. ఓ ఆగంతకుడు ఈ బాంబు బెదిరింపు ఫోన్ కాల్ చేసినట్లు పోలీసులు తెలిపారు.