: ఆస్ట్రేలియాలో భారతీయుడిపై మరో జాత్యహంకార దాడి
ఆస్ట్రేలియాలో జాత్యహంకారం మరోసారి పురివిప్పింది. ఏడాది తరువాత మరోసారి జాత్యహంకార దాడి భారతీయుడిపై జరిగింది. గతంలో చైనా దేశీయులే ప్రధానంగా దాడులు జరిగేవి. అప్పట్లో భారతీయులు కూడా కొన్ని సందర్భాల్లో ఈ దాడులబారిన పడేవారు. క్రమంగా వీటి సంఖ్య పెరిగిపోవడంతో ఆస్ట్రేలియాలో చదువుకునే విద్యార్ధుల సంఖ్యపడిపోయింది. దానికి తోడు భారతీయ దౌత్య కార్యాలయం కాస్త గట్టిగానే స్పందించింది. దీంతో అక్కడి అధికారులు అప్రమత్తమై దాడులను సమర్ధవంతంగా అడ్డుకున్నారు. దీంతో గత ఏడాది కాలంగా దాడులు జరిగిన సందర్భాలు లేవు. తాజాగా మెల్ బోర్న్ లో రెస్టారెంట్ నడుపుతున్న హిమాంశు గోయల్(22) అనే భారతీయుడ్ని 8 మంది యువకుల బృందం జాత్యహంకారంతో దూషించగా, మరికొంతమంది దాడికి పాల్పడ్డారు. దీంతో అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. గోయల్ ను బలారత్ మేయర్ జాన్ బర్ట్ పరామర్శించారు. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.