బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం.. ఆసియా క‌ప్‌కు టీమిండియా దూరం!

  • ఈ ఏడాది ఆసియా క‌ప్ ఆడ‌కూడ‌ద‌ని బీసీసీఐ నిర్ణ‌యం
  • ఈ మేర‌కు బీసీసీఐ వ‌ర్గాల‌ను ఉటంకిస్తూ ప‌లు ఆంగ్ల మీడియా క‌థ‌నాలు 
  • ఇప్ప‌టికే ఏసీసీకి బీసీసీఐ స‌మాచారం ఇచ్చిన‌ట్లు పేర్కొన్న స‌ద‌రు క‌థ‌నాలు
ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి, ఆప‌రేష‌న్ సిందూర్‌తో భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య ఇటీవ‌ల నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఈ ఏడాది జ‌రిగే ఆసియా క‌ప్ టోర్నీలో ఆడ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు బీసీసీఐ వ‌ర్గాల‌ను ఉటంకిస్తూ ప‌లు ఆంగ్ల మీడియా క‌థ‌నాలు వెల్ల‌డించాయి. దీనిపై ఇప్ప‌టికే ఆసియా క్రికెట్ మండ‌లి (ఏసీసీ)కి భార‌త క్రికెట్ బోర్డు స‌మాచారం ఇచ్చిన‌ట్లు స‌ద‌రు క‌థ‌నాలు పేర్కొన్నాయి. 

కాగా, 2023లో జ‌రిగిన ఆసియా క‌ప్‌లో టీమిండియా విజేత‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. ఫైన‌ల్లో శ్రీలంక‌ను 10 వికెట్ల తేడాతో ఓడించింది రోహిత్ సేన‌. ఈ మ్యాచ్‌లోనే హైద‌రాబాదీ మ‌హ్మ‌ద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. ఏకంగా ఆరు వికెట్లు ప‌డ‌గొట్టాడు. 7 ఓవ‌ర్లు వేసిన‌ సిరాజ్ 21 ర‌న్స్ మాత్ర‌మే ఇచ్చాడు. ఈ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. 


More Telugu News