చిరు-అనిల్ రావిపూడి మూవీలో హీరోయిన్ ఫిక్స్.. ప్ర‌త్యేక వీడియో విడుద‌ల చేసిన మేక‌ర్స్

  • చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో 'మెగా 157'
  • హీరోయిన్‌గా న‌య‌న‌తార‌ను ఫిక్స్ చేసిన మేక‌ర్స్‌
  • ఈ మేర‌కు ప్ర‌త్యేక వీడియో విడుద‌ల‌
మెగాస్టార్ చిరంజీవి, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి కాంబోలో ఓ మూవీ (మెగా 157) తెర‌కెక్కనున్న‌ విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్ పూజాకార్య‌క్ర‌మాలు కూడా జరుపుకుంది. త్వ‌ర‌లోనే షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతోన్నారు మేక‌ర్స్‌. ఈ లోపు చిరు కోసం అనిల్ క‌థానాయిక‌ను ఫిక్స్ చేశారు. 

ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడిగా నయనతార‌ నటిస్తోందని పుకార్లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు వాటినే నిజం చేస్తూ మేక‌ర్స్ ఆమెనే హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. ఈ మేర‌కు తాజాగా ఓ వీడియోను కూడా విడుద‌ల చేశారు. 

'మెగా 157' ప్రాజెక్ట్‌లోకి నయన్ వచ్చిందంటూ వదిలిన వీడియో ఆక‌ట్టుకుంటోంది. మ‌రోసారి అనిల్ రావిపూడి త‌న‌దైన‌శైలిలో ఈ వీడియోను రూపొందించారు. ఒక విధంగా చెప్పాలంటే... అసలు ప్రమోషన్స్ అంటే నో చెప్పే నయన్‌తోనే సినిమా ఆరంభానికి ముందే ఆమెను అనిల్ ప్రమోషన్స్‌లోకి తీసుకొచ్చార‌నే చెప్పాలి. 

వీడియో చివ‌ర్లో  సంక్రాంతికి రఫ్పాడించేద్దాం అని ఇద్దరూ (న‌య‌న్‌, అనిల్) చిరు ఐకానిక్ పోజులు పెట్టడం ఆక‌ట్టుకుంటోంది. అలాగే చిరంజీవి మేన‌రిజంలో హలో మాస్టారు... కెమెరా కొద్దిగా రైట్ ట‌ర్నింగ్ ఇచ్చుకోమ్మా అంటూ చెప్పిన సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులోకి ఆమెను ఆహ్వానిస్తూ చిరంజీవి కూడా పోస్టు పెట్టారు. "హ్యాట్రిక్ మూవీకి స్వాగ‌తం. ఆమెతో క‌లిసి ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది" అని చిరు అన్నారు.  

కాగా, చిరు, న‌య‌న్ కాంబినేష‌న్‌లో ఇదివ‌రకే 'సైరా న‌ర‌సింహారెడ్డి', 'గాడ్ ఫాద‌ర్' చిత్రాలు వచ్చిన విష‌యం తెలిసిందే. ఇక‌, ఈ మూవీ షూటింగ్‌ను ఈ ఏడాదిలోనే పూర్తి చేసి, 2026 సంక్రాంతికి సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. ఈ మేర‌కు ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. భీమ్స్ సంగీతం ఈ చిత్రానికి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌. మ‌రోవైపు ఇప్ప‌టికే విశ్వంభ‌ర‌ను పూర్తి చేసిన చిరంజీవి... అనిల్ మూవీ త‌ర్వాత ద‌స‌రా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలాతో మ‌రో సినిమా చేయ‌నున్నారు. 



More Telugu News