: బాలీవుడ్ నటి షబానాకు నాలుగో డాక్టరేట్
బాలీవుడ్ నటి షబానా అజ్మీ నాలుగోసారి డాక్టరేట్ అందుకోవడానికి సిద్ధమయ్యారు. రేపు వాంకోవర్(కెనడా)లోని సిమన్ ఫ్రాసెర్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆమెకు డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. 61 ఏళ్ల షబానా అంతకుముందు జాదవపూర్ యూనివర్సిటీ(2003), యార్క్ షైర్ లోని లీడ్స్ మెట్రోపాలిటన్ వర్సిటీ(2007), జామియా మిలియా వర్సిటీ(2008) నుంచి ఆమె డాక్టరేట్లు అందుకున్నారు.