అమృత్‌సర్‌లో పాక్ డ్రోన్లను కూల్చివేసిన భారత్ .. వీడియో విడుదల చేసిన ఆర్మీ

  • అమృత్‌సర్ లోని ఖాసా కంటోన్మెంట్ గగనతలంలో శత్రు డ్రోన్ ను భద్రతా బలగాలు గుర్తించాయన్న ఆర్మీ అధికారులు
  • వెంటనే వైమానిక రక్షణ విభాగాలు డ్రోన్ ను కూల్చివేశాయని వెల్లడి
  • వీడియో, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆర్మీ అధికారులు 
భారత – పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ సైన్యం శుక్రవారం రాత్రి భారత భూభాగంలోని పలు ప్రాంతాలపై డ్రోన్లు, శతఘ్నులతో దాడులకు పాల్పడగా, భారత బలగాలు దీటుగా స్పందించాయి. శనివారం వేకువజామున అమృతసర్‌లోని ఖాసా కంటోన్మెంట్ గగనతలంలో భద్రతా బలగాలు శత్రు డ్రోన్‌ను గుర్తించాయని ఆర్మీ అధికారులు తెలిపారు.

వైమానిక రక్షణ విభాగాలు వెంటనే ఆ డ్రోన్‌ను కూల్చివేశాయని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను, ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మరోవైపు శ్రీనగర్ ఎయిర్ బేస్‌పై డ్రోన్లతో దాడి జరగగా, సైన్యం వాటిని తిప్పికొట్టింది. శ్రీనగర్‌లోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. 


More Telugu News