: భారత్ కు పత్రాలిచ్చేందుకు ఇటలీ కోర్టు విముఖత


అగస్టా హెలికాఫ్టర్ల కొనుగోలు కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాలను ఇవ్వాలన్న భారత అభ్యర్థనను ఇటలీ కోర్టు తోసిపుచ్చింది. వీవీఐపీల భద్రత కోసం కొనుగోలు చేయాలనుకున్న ఈ హెలికాఫ్టర్లపై జరిగిన భారీ కుంభకోణంపై ఇటలీ కోర్టు విచారణ చేపట్టింది. 

కేసు విచారణ  ప్రాధమిక దశలో ఉన్నందున పత్రాలను ఇచ్చేది లేదని ఇటలీ కోర్టు తేల్చి చెప్పింది. అయితే భారత్ అభ్యర్థనపై తర్వాత స్పందిస్తామని న్యాయమూర్తి తెలిపారు. మరోవైపు సీబీఐ బృందంతో పాటు రక్షణ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ కూడా ఈ కేసుపై విచారణ జరిపేందుకు రేపు ఇటలీ వెళ్లనున్నారు.

  • Loading...

More Telugu News