: వెంటిలేటర్ పై ఎన్డీయే.. అద్వానీ ఆక్సిజన్ అందించాలి: జేడీయూ


భారతీయ జనతాపార్టీ పదవులకు అద్వానీ చేసిన రాజీనామాపై జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) వినూత్నంగా స్పందించింది. వెంటిలేటర్ పై ఉన్న ఎన్డీయేకు అద్వానీ ఆక్సిజన్ అందించాలని ఆ పార్టీ కోరింది. అటల్ జీ అనారోగ్యంతో ఉన్నారు. అద్వానీజీ వెళ్లిపోయారు. ఇక ఎన్డీయేను చూసేది ఎవరో తనకు అర్థం కావడం లేదని జేడీయూ నేత కేసీ త్యాగి అన్నారు. మోడీ పేరు ప్రస్తావించకుండా, అద్వానీ నుంచి అధికారం ఎక్కడికో వెళ్లిపోయిందన్నారు. అద్వానీ బీజేపీకి దూరమైతే తాము ఎన్డీయేలో కొనసాగలేమని జేడీయూ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News