: అసెంబ్లీని మోతెక్కించిన విపక్షాలు.. సభ రేపటికి వాయిదా
శాసనసభ సమావేశాల రెండో రోజున విపక్షాలు నిరసనలతో అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడిన సభ మళ్ళీ మొదలైనా.. సర్కారుకు మాత్రం చికాకు తప్పలేదు. ఓ వైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. మరోవైపు టీఆర్ఎస్ ఇతర పార్టీలు పలుసార్లు పోడియం వద్దకు దూసుకెళ్ళి నినాదాలతో హోరెత్తించాయి. బయ్యారంపై టీడీపీ.. తెలంగాణ అంశంపై టీఆర్ఎస్.. ఆందోళనకు దిగాయి. బడ్జెట్ పద్దులపై చర్చ చేపడదామని స్పీకర్ నాదెండ్ల మనోహర్ సూచించినా విపక్ష సభ్యులు వైఖరి వీడలేదు. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు సభాపతి ప్రకటించారు.